Home  »  TV News  »  Ye Devi Varamo Neevu : అంజలి ఎంట్రీతో ఇంట్లో మొదలైన గొడవలు.. షాక్‌లో రాజారావు కుటుంబం!

Updated : Aug 15, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -35 లో..... అంజలిని చూసిన గీతంజలి షాక్ అవుతుంది. నా పరువుపోవడానికి కారణం ఈ అంజలి అని గీత చెప్తుంది. తన వల్ల నీ పరువు పోవడం ఏంటని భాను అడుగుతాడు. మొన్న మీడియా ముందు నా గురించి తప్పుగా చెప్పింది తనే అని గీత అంటుంది. ఇప్పుడు అంజలి నీకు సారీ చెప్తుంది.. తనపై కోపం పెట్టుకోకు అని రాజారావు అంటాడు. ఇప్పుడు తన సారీ నాకేం అవసరం లేదు ఇప్పుడు మనీష్ నేను అడిగే వాటికి సమాధానం చెప్పాలని గీత అంటుంది. అంజలి ఇక్కడున్న విషయం ఎందుకు నాతో చెప్పలేదని గీత అడుగుతుంది. మనీష్ సైలెంట్ గా ఉంటాడు. అంజలి ఇక్కడికి రావడానికి కారణం నేనే.. ఈ విషయం నీతో చెప్పొద్దని మాట తీసుకున్నానని రాజారావు అంటాడు.

 

ఎందుకు ఆ అమ్మాయిని ఇక్కడ ఉంచావని గీత అడుగుతుంది. మీ అమ్మ కోసం అని రాజారావు చెప్పగానే సరే ఇప్పుడే తనని ఇంట్లో నుంచి పంపించేయ్ అని గీత అంటుంది. లేదు తన పని అయ్యేవరకు ఎక్కడికి వెళ్ళదని రాజారావు చెప్తాడు. తను ముఖ్యమా నేను ముఖ్యమా అని గీత అడుగుతుంది. తనకి ఇచ్చిన మాట ముఖ్యమని రాజారావు అంటాడు. అయితే తనని ఇంట్లో నుంచి పంపించే వరకు నేను ఈ ఇంట్లో అడుగుపెట్టనని గీత తన ఫ్యామిలీని తీసుకొని వెళ్తుంది. అప్పుడే శంకర్ డాక్టర్ ని తీసుకొని వస్తాడు. ఏమైందని గీతని అడుగుతాడు. మీ నాన్నని అడుగు అని గీత వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రత్నంకి అంజలి టాబ్లెట్ ఇస్తుంటే చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు అని అంజలిపై శంకర్ కోప్పడతాడు. ఏంటి నాన్న ఇది.. ఎవరి కోసమో చెల్లిని బాధపెట్టడమేంటి.. అసలు తనకి నీకు ఏం సంబంధమని శంకర్ అడుగుతాడు. రాజారావు మౌనంగా ఉంటాడు.

 

నువ్వు చెప్పకుంటే నేను తెలుసుకోలేనా అని శంకర్ అంటాడు. రాజారావు టెన్షన్ తో పడిపోతాడు. ఏమైందంటూ అందరు రాజారావు దగ్గరికి వెళ్తారు. తరువాయి భాగంలో నా వల్ల మీకు ఎందుకు గొడవలు నేను వెళ్ళిపోతానని రాజారావుతో అంజలి చెప్తుంది. మరొకవైపు గీత దగ్గరికి మనీష్ వెళ్తే అసలు తన వైపు కూడా చూడదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Ye Devi Varamo Neevu, Star Maa Serials, Geethanjali, Anjali, Ye Devi Varamo Neevu Latest Episode






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.